Sankranti Special Buses: సంక్రాంతి పండుగ సందర్భంగా 2,400 ప్రత్యేక బస్సులు..! 8 d ago
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని సొంతూర్లకు వెళ్లాలనుకునేవారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పండుగ సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2,400 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్పెషల్ బస్సు సేవలు జనవరి 9 నుండి జనవరి 13 వరకు అందుబాటులో ఉండనున్నాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్లతో సహా ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సాధారణ, ప్రత్యేక బస్సులు గౌలిపురలోని పాత సెంట్రల్ బస్ స్టేషన్ నుండి బయలుదేరుతాయని అధికారులు పేర్కొన్నారు.
పండగ రద్దీ సమయంలో టికెట్ చార్జీలు ఆకాశాన్నంటే విషయం తెలిసిందే. సాధారణ సమయాలతో పోలిస్తే సంక్రాంతి పండగ రోజుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తారు. ఈ విషయంలోనూ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పెరుగుతున్న ఖర్చుల గురించి ఆందోళన చెందే ప్రయాణికులపై కొంత ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
టీజీఆర్టీసీ స్పెషల్ బస్సులు...
మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లేందుకు స్పెషల్ బస్ సర్వీసులు నడపనుంది. సిటీ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు వంటి రూట్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3 వేలకు పైగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు పేర్కొంది.